భారత్ లో యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ గా వీణా రెడ్డి... శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • ఏపీలో పుట్టిన వీణారెడ్డి
  • అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు పలు సేవలు
  • భారత్ లో యూఎస్ ఎయిడ్ కు సారథ్యం
  • తొలి భారతీయ అమెరికన్ గా ఖ్యాతి
  • గర్విస్తున్నామన్న ఏపీ సీఎం జగన్
భారత సంతతి అమెరికా పౌరురాలు వీణా రెడ్డికి బైడెన్ సర్కారు కీలక పదవి అప్పగించింది. అమెరికా ప్రభుత్వం వీణా రెడ్డిని భారత్ లో యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిషన్ డైరెక్టర్ గా నియమించింది. యూఎస్ ఎయిడ్ సంస్థకు భారత్ లో సేవలు అందిస్తున్న తొలి భారతీయ అమెరికన్ వీణారెడ్డి. ఏపీలో పుట్టిన వీణారెడ్డి... అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు అనేక సేవలు అందించారు.

ఆమె తాజా నియామకంపై ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. యూఎస్ ఎయిడ్ కు భారత్ లో నాయకత్వం వహిస్తున్న తొలి భారత సంతతి దౌత్యవేత్త వీణా రెడ్డి అని కొనియాడారు. వీణా రెడ్డి ఘనతల పట్ల గర్విస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.


More Telugu News