దేశం గర్విస్తోంది... భారత హాకీ జట్టు విజయంపై బాలకృష్ణ స్పందన

  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అద్భుత విజయం
  • కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు
  • 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో దేశానికి పతకం
  • అభినందనలు తెలిపిన బాలయ్య
టోక్యో ఒలింపిక్స్ లో జర్మనీపై అద్భుత విజయంతో భారత హాకీ జట్టు కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా భారత హాకీ జట్టు ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్విస్తోందని, భారతదేశానికి 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో హాకీ క్రీడాంశంలో పతకం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఎంతో కఠోరశ్రమతో ఈ పతకం వచ్చిందని వివరించారు.

దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడాకారులకు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. పతకం సాధించడం ద్వారా దేశ ప్రతిష్ఠను చాటిచెప్పిన హాకీ జట్టుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఒలింపిక్స్ లో ఇతర భారత క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.


More Telugu News