ఆలోచనలో పడిన 'టక్ జగదీష్'

  • విడుదలకు రెడీగా 'టక్ జగదీష్'
  • థియేటర్లలో రిలీజ్ చేసే ఉద్దేశంతో వెయిటింగ్  
  • ఆశించిన స్థాయిలో కనిపించని రెస్పాన్స్ 
  • ఓటీటీ వైపు వెళ్లే అవకాశం  
నాని హీరోగా 'టక్ జగదీష్' చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ రూపొందించాడు. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబాలు .. బంధాల చుట్టూ తిరిగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ నడుస్తుంది. గడిచిన ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరగడంతో విడుదలను వాయిదా వేసుకున్నారు.

ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో వెయిట్ చేస్తూ వచ్చారు. థియేటర్లు తెరుచుకున్నాయిగానీ, ఆశించిన స్థాయిలో జనాలు రావడం లేదు. క్రితం వారం విడుదలైన సినిమాలు చూసేందుకు జనం చాలా పల్చగా వచ్చారు. వీకెండులో కూడా పుంజుకోకపోవడంతో వసూళ్ల విషయంలో నిరాశనే మిగిలింది.

దాంతో ఇప్పుడు 'టక్ జగదీష్' మేకర్స్ ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు ఉన్నప్పుడు, రిస్క్ చేయడం అవసరమా? అనుకుంటున్నారట. ఇక నానీ కూడా నిర్మాతల ఇష్టానికే ఈ విషయాన్ని వదిలేశాడని అంటున్నారు. త్వరలో ఓటీటీ ద్వారానే ఈ సినిమా పలకరించనుందని చెబుతున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.  


More Telugu News