'దేశం గర్విస్తోంది'.. చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
- హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శం
- అసాధారణ ప్రతిభ కనబరిచింది: కోవింద్
- ఈ విజయం భారతీయులకు మరపురాని రోజు
- యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారు: మోదీ
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించడంతో భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్‌లో ఆ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచిందని ప్రశంసించారు. చారిత్రక విజయంతో హాకీలో కొత్త శకానికి నాంది పలికిందని అన్నారు.
భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఈ విజయం భారతీయులకు మరపురాని రోజని చెప్పారు. యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో మన్‌ప్రీత్ సింగ్ సేన పతకం అందించడంతో అమృత్‌సర్ లోని ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.