చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. ఒలింపిక్స్‌‌‌లో 4 దశాబ్దాల తర్వాత పతకం

  • జర్మనీతో హోరాహోరీగా తలపడిన భారత్
  • చివరి క్వార్టర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాళ్లు
  • దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

అయితే, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.


More Telugu News