కొలనోస్కోపీ.. ఇక ఈజీ: డాక్టర్ రామిరెడ్డి రూపొందించిన పరికరానికి పేటెంట్

  • గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రామిరెడ్డి
  • కాంపోజిట్ పోలిపెక్టమీ స్నేర్ పరికరం రూపకల్పన
  • పెద్దపేగు పొరల్లోని పీలికలను గుర్తించడం ఇక సులభం
హైదరాబాదుకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ యలకా రామిరెడ్డి రూపొందించిన ‘కొలనోస్కోపీ’ పరికరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న పేటెంట్ లభించింది. డాక్టర్ రామిరెడ్డి హైదరాబాద్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

పెద్దపేగును పరీక్షించేందుకు కొలనోస్కోపీ చేసే సమయంలో లోపలి పొరల్లో ఉన్న పీలికల్ని గుర్తించేందుకు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్ రామిరెడ్డి ‘కాంపోజిట్ పోలిపెక్టమీ స్నేర్’ అనే పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంతో కొలనోస్కోపీ మరింత సులభంగా మారనుంది. సమయం కూడా ఆదా అవుతుంది.

శస్త్ర చికిత్స సమయంలో అయ్యే అంతర్గత రక్తస్రావాలను ఈ పరికరం నియంత్రిస్తుందని డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందన్నారు. కాగా, రామిరెడ్డి గతంలో అన్నవాహిక కేన్సర్‌తో బాధపడుతున్న రోగుల కోసం ‘ఫీడింగ్ పైపు’ను రూపొందించారు. దీనికి కూడా ఆయనకు పేటెంట్ లభించింది.


More Telugu News