తీన్మార్ మల్లన్నపై కేసులో వాంగ్మూలాల నమోదు.. కేసులకు భయపడబోనన్న నవీన్

  • దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు
  • పోలీసులు తీసుకెళ్లిన హార్డ్ డిస్క్‌లలో కేసీఆర్ అక్రమాలు ఉన్నాయన్న మల్లన్న
  • 29న అలంపూర్‌లో తదుపరి కార్యాచరణ ప్రకటన
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడిచేసి హార్డ్ డిస్క్‌లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ప్రియాంకతోపాటు సహోద్యోగి చిలక ప్రవీణ్ వాంగ్మూలాలను నమోదు చేశారు.

మరోపక్క, తన కార్యాలయంపై జరిగిన దాడుల ఘటనపై మల్లన్న స్పందించారు. ‘యుద్ధం మిగిలే ఉంది.. 7200’ పేరుతో హన్మకొండలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లన్న.. పోలీసు కేసులకు భయపడబోనని తేల్చి చెప్పారు. పోలీసులు తీసుకెళ్లిన హార్డ్‌డిస్క్‌లలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు ఉన్నాయని అన్నారు. ఈ నెల 29న అలంపూర్‌లో తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్టు మల్లన్న తెలిపారు.


More Telugu News