10వ తేదీ తర్వాత ఫాంహౌస్‌కు రండి.. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం: కాశిరెడ్డిపల్లి గ్రామస్థులతో కేసీఆర్
- గ్రామ సమస్యలపై కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చిన కాశిరెడ్డిపల్లి గ్రామస్థులు
- గ్రామానికి చెందిన పదిమంది ఫాంహౌస్‌కు రావాలని ఆహ్వానం
- సమస్యలను పరిష్కరిస్తానని హామీ
తనకు ఇప్పుడు సమయం లేదని, పదో తేదీ తర్వాత ఫాంహౌస్‌కు వస్తే భోజనం చేస్తూ గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుందామంటూ కాశిరెడ్డిపల్లి గ్రామస్థులకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ సాయంత్రం తిరిగి ఎర్రవల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో 5.50 గంటల సమయంలో కేసీఆర్ కాన్వాయ్ కాశిరెడ్డిపల్లి చేరుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తున్న విషయం తెలిసిన కాశిరెడ్డిపల్లి సర్పంచ్ స్వరూప, మరికొందరు నాయకులు రోడ్డుకు ఇరువైపులా నిల్చున్నారు.
వారిని చూసిన కేసీఆర్ వాహనాన్ని ఆపి, దగ్గరకు పిలిచారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి చైర్మన్ మల్లేశ్ తదితరులు సీఎంతో తమ గ్రామ సమస్యలను వెళ్లబోసుకుని వినతిపత్రం అందించారు. అయితే తనకిప్పుడు సమయం లేదని, ఈ నెల 10వ తేదీ తర్వాత పిలుస్తానని, గ్రామానికి చెందిన పదిమంది ఫాంహౌస్‌కు వస్తే కలిసి భోజనం చేస్తూ గ్రామ సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.