ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు బాలికలతో శారీరక సంబంధం పెట్టుకున్న బాలుడు.. కేసు నమోదు
- తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఘటన
- మూడో బాలిక నేరుగా బాలుడి ఇంటికి రావడంతో వెలుగులోకి బాగోతం
- పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ బాలుడు ముగ్గురు బాలికలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి ఆపై మోసం చేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..
గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు పొరుగూరికి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో కొన్ని డబ్బులిచ్చి ఆమెతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు.
ఆ తర్వాత 14 ఏళ్ల మరో బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగక 17 ఏళ్ల ఇంకో బాలికను పెళ్లాడతానంటూ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే, బాలుడిని అనుమానించిన బాలిక నేరుగా అతడి ఇంటికి రావడంతో అతడి బాగోతం బయటపడింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.