కేఆర్ఎంబీ బృందం నేటి రాయలసీమ పర్యటన వాయిదా.. బృందంలో తెలంగాణ వ్యక్తి ఉండడంతో ఏపీ అభ్యంతరం
- బృందంలోని దేవందర్‌రావు తెలంగాణ వ్యక్తి అంటూ ఫిర్యాదు
- ఎన్‌జీటీ ఆదేశాలతో పర్యటన వాయిదా
- ఈ నెల 9న అమరావతిలో జీఆర్ఎంబీ అత్యవసర సమావేశం
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నేటి రాయలసీమ ఎత్తిపోతల ప్రాంత పర్యటన వాయిదా పడింది. ఈ బృందంలో తెలంగాణ వ్యక్తి అయిన దేవేందర్‌రావు ఉన్నారంటూ ఏపీ అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్‌జీటీ అదేశాల మేరకు బృందం పర్యటన వాయిదా పడింది. కాగా, ఈ నెల 9న అమరావతిలో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
జీఆర్ఎంబీ పరిధిలో కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం జీఆర్ఎంబీ వ్యవస్థ నిర్మాణంపై మెంబర్ సెక్రటరీ బీపీ పాండే చర్చించనున్నారు. అలాగే, గెజిట్ నోటిఫికేషన్‌లోని పలు క్లాజులపైనా చర్చించనున్నట్టు తెలిపారు.