జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులతో పవన్ కల్యాణ్ భేటీ

  • పార్టీ బలోపేతంపై చర్చ
  • ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం
  • ఈ నెల 7న సమావేశం ఏర్పాటు చేయాలని సూచన
  • అభిప్రాయాలు సేకరించాలన్న జనసేనాని
జనసేనను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పవన్ తో ఈ మధ్యాహ్నం జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రజల సమస్యలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, పర్యావరణ సంబంధ అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 7న ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News