ఈ నెల 24న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ
- అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
- రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు
- గ్రామ సచివాలయాల్లో వివరాల నమోదు
- ఈ నెల 6 నుంచి 12 వరకు అవకాశం
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించనుంది. ఈ నెల 24న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు ఖాతాల్లో ఈ మేరకు నగదు డిపాజిట్ చేయనున్నారు. ఆగస్టు 24న ఒక్క బటన్ క్లిక్ తో సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు.
దీనిపై సీఐడీ విభాగం వివరణ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు తమ వివరాలను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 12 వరకు వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు 1800 4253 875 టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించాలని పేర్కొంది.