వాసాలమర్రి దళితవాడల్లో కేసీఆర్​ పర్యటన

  • సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం
  • గ్రామంలో పారిశుద్ధ్య పనుల పరిశీలన
  • రైతు వేదికలో గ్రామస్థులతో సమావేశం
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన.. యాదాద్రి జిల్లా వాసాలమర్రికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని, దళితవాడల్లో కలియ తిరిగారు. అధికారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

అనంతరం స్థానికంగా ఉన్న రైతువేదికలో గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత గతంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. జూన్ 22న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. గ్రామస్థులకు మంచి విందు భోజనం ఇచ్చారు. అలాగే వారితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

నాడు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై సమీక్ష చేసేందుకు 42 రోజుల తర్వాత మళ్లీ ఆయన వాసాలమర్రికి వెళ్లారు. తదుపరి కార్యాచరణపై నేతలు, అధికారులు, గ్రామస్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.


More Telugu News