నిబంధనలకు విరుద్ధంగా నియమించారంటూ పిటిషన్.. తెలుగు, కాకతీయ వర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు
- ఇటీవలే వైస్ చాన్సలర్‌ల నియామకం
- కాకతీయ వర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషన్
- తెలుగు విశ్వవిద్యాలయ వీసీ వయసు 70 ఏళ్లు దాటిందని అభ్యంతరం
- నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు
తెలంగాణలోని విశ్వ విద్యాలయాలకు ఇటీవల వైస్ చాన్సలర్‌లను నియమించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు వీసీలను నిబంధనలకు విరుద్ధంగా నియమించారంటూ విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
ఆ రెండు వర్సిటీల వీసీల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. కాకతీయ వర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని తెలిపారు. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయ వీసీ వయసు 70 ఏళ్లు దాటిందని వివరించారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీని కూడా హైకోర్టు ఆదేశించింది.