వైఎస్ వివేక హ‌త్య కేసు: గోవాలో ప‌ట్టుబ‌డ్డ సునీల్‌ను ప్ర‌శ్నిస్తోన్న సీబీఐ అధికారులు

  • 59వ రోజు కొన‌సాగుతోన్న‌ విచార‌ణ
  • క‌డప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో కొన‌సాగింపు
  • సునీల్‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న అధికారులు
  • విచార‌ణ‌కు గంగిరెడ్డి, ఉమా మ‌హేశ్వ‌ర్ రెడ్డి హాజ‌రు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) 59వ రోజు విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు ఇటీవ‌ల‌ గోవాలో అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు సునీల్ యాద‌వ్ ను ప‌లు సార్లు ప్ర‌శ్నించిన అధికారులు... ఈ రోజు మ‌రోసారి ఆయ‌న‌ను క‌డప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో  ప్ర‌శ్నిస్తున్నారు.

నిన్న కూడా ఆయ‌న‌ను విచారించారు. సునీల్‌ను ఈ రోజు అధికారులు కోర్టులో హాజ‌రుప‌రచ‌నున్నారు. ఈ రోజు సునీల్ యాద‌వ్‌తో పాటు ఎర్ర గంగిరెడ్డి, సంకేశుల‌కు చెందిన ఉమా మ‌హేశ్వ‌ర్ రెడ్డిని కూడా అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.
 
కాగా, సునీల్ యాద‌వ్‌ను అరెస్టు చేయ‌డం, కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌క్రియ‌పై అధికారులు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. వివేకానంద హ‌త్య కేసు విచార‌ణలో సీబీఐ అధికారుల‌కు ప‌లు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. వివేకానంద హ‌త్య జ‌రిగిన రెండేళ్ల త‌ర్వాత నిందితుడిని సీబీఐ తొలిసారి అదుపులోకి తీసుకుంది.


More Telugu News