త‌న‌ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి క‌దా అని కేసీఆర్ మురిసిపోతున్నారు: ష‌ర్మిల‌

  • వంద‌లాది మంది నిరుద్యోగులు చ‌నిపోతున్నా కేసీఆర్‌లో చ‌ల‌నం లేదు
  • నిరుద్యోగుల‌కు ఏమైతే నాకేం? అనుకుంటున్నారు
  • కండ్ల ముందే ల‌క్షా 91వేల ఖాళీలు
  • వాటిని భ‌ర్తీ చేయ‌డం లేదు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'వంద‌లాది మంది నిరుద్యోగులు చ‌నిపోతున్నా కేసీఆర్‌లో చ‌ల‌నం లేదు. నిరుద్యోగుల‌కు ఏమైతే నాకేం? నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి క‌దా అని మురిసిపోతున్నారు. కండ్ల ముందే ల‌క్షా 91వేల ఖాళీలున్నా.. వాటిని భ‌ర్తీ చేయ‌డం లేదు. నిరుద్యోగుల ప‌క్షాన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంది' అని ష‌ర్మిల స్ప‌ష్టం చేస్తూ ఈ రోజు ట్వీట్ చేశారు.
                
కాగా, తెలంగాణ‌లో ల‌క్షా 91వేల ఉద్యోగ‌ ఖాళీలను భ‌ర్తీ చేయాల‌ని వైఎస్‌ ష‌ర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం దీక్ష చేస్తోన్న విష‌యం తెలిసిందే. అలాగే, రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను ప‌లువురు మ‌హిళ‌లు క‌లిశారు. అందుకు సంబంధించిన ఫొటోను ష‌ర్మిల ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


More Telugu News