టోక్యో ఒలింపిక్స్.. రెజ్లింగ్‌లో క్వార్టర్స్‌కు రవికుమార్ దహియా

  • టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో శుభవార్త
  • కొలింబియా రెజ్లర్ ఆస్కార్‌ను 13-2తో చిత్తు చేసిన రవికుమార్
  • మరో రెజ్లర్ అన్షుమాలిక్ ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నేడు మరో గుడ్‌న్యూస్. రెజ్లర్ రవికుమార్ దహియా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కొలంబియాకు చెందిన ఆస్కార్ ఎడౌర్డోతో జరిగిన పోరులో 13-2తో విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వాలెంటినోవ్‌తో తలపడతాడు. మరోవైపు, 57 కేజీల మహిళల ఓపెనింగ్ రౌండ్‌లో ఇండియన్ రెజ్లర్ అన్షు మాలిక్ బెలారస్‌కు చెందిన ఇరీనా కురచ్కినా చేతిలో 8-2తో ఓటమి పాలైంది. కాగా, అంతకుముందు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకున్నాడు.


More Telugu News