ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్టియర్ పరీక్షలు
- మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు
ఏపీ ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 23 దాకా పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు.