వాహనదారులూ బహుపరాక్.. ఇకపై ఒక్క చలానా ఉన్నా బండి సీజ్ చేస్తామంటున్న హైదరాబాద్ పోలీసులు!

  • ఇప్పటి వరకు మూడు చలానాలు ఉంటేనే వాహనం సీజ్
  • సైబరాబాద్ పరిధిలో గతేడాది 47.83 లక్షల కేసుల నమోదు
  • రూ. 178.35 కోట్లకు వసూలైంది రూ. 30.32 కోట్లు మాత్రమే  
హైదరాబాద్‌లోని వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై ఒక్క ట్రాఫిక్ చలానా ఉన్నా వాహనాన్ని సీజ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటి వరకు మూడు చలానాలు ఉంటేనే వాహనాన్ని సీజ్ చేసేవారు. కానీ ఇకపై అలాంటి అవకాశం లేకుండా ఒక్క చలానా పెండింగులో ఉన్నా వాహనం సీజ్ అయిపోతుంది.

గతేడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసులు నమోదు చేసిన పోలీసులు రూ. 178.35 కోట్ల జరిమానా విధించారు. అయితే, ఇప్పటి వరకు వసూలైంది మాత్రం రూ. 30.32 కోట్లు మాత్రమే. ఇలాగైతే లాభం లేదని భావించిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి చలానాలు పెండింగులో ఉన్న వాహనాలను పట్టుకుని చలానాలు కట్టిస్తున్నారు. కట్టని వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.


More Telugu News