టోక్యో ఒలింపిక్స్.. జావెలిన్ త్రో ఫైనల్‌కు నీరజ్ చోప్రా

  • క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి రౌండ్‌లోనే అర్హత
  • గ్రూప్-బిలో పోటీపడుతున్న శివపాల్ సింగ్
  • ఉదయం 11 గంటలకు మహిళల బాక్సింగ్ సెమీ ఫైనల్
టోక్యో ఒలింపిక్స్‌లో నేడు భారత ప్రస్థానం విజయంతో ప్రారంభమైంది. ఉదయం 5.35 గంటలకు జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీకి చెందిన జె.వెట్టర్ (85.64 మీ), ఫిన్లాండ్‌కు చెందిన ఎల్.ఎటెలాటలో (84.50 మీ) నిలిచారు. ఈ నెల 7న జావెలిన్ త్రో ఫైనల్ జరగుతుంది.

మరోవైపు గ్రూప్-బిలో ఇదే అంశంపై జరుగుతున్న క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్‌కు చెందిన శివపాల్ సింగ్ కూడా తలపడుతున్నాడు. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఉదయం 11 గంటలకు బుసానజ్‌తో సెమీఫైనల్‌లో తలపడుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు భారత్-అర్జెంటీనా మధ్య మహిళల హాకీ సెమీస్ జరగనుంది.


More Telugu News