'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమా యూనిట్ పై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • విమర్శలపాలవుతున్న సినిమా ట్రైలర్
  • హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని ఫిర్యాదు
  • 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమా యూనిట్ కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేశారు. సినిమా ట్రైలర్ లో ఓ సన్నివేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని పేర్కొంటూ ఆన్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. పాటలు, సీన్లు, డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో సైతం వ్యతిరేకత వ్యక్తమయింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కొందరు హెచ్చరించారు. దీంతో, చిత్ర యూనిట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేయనున్నారు.


More Telugu News