హిందీ 'ఛత్రపతి ' కోసం బెల్లంకొండ కసరత్తు!
- బాలీవుడ్ పై బెల్లంకొండ దృష్టి
- సెట్స్ పై 'ఛత్రపతి' హిందీ రీమేక్
- మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ
- హిందీ భాషపై పట్టు కోసం ప్రయత్నాలు
బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో తొలి సినిమా నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ వెళ్లాడు. కథాకథనాల పరంగా జయాపజయాలు ఉన్నప్పటికీ, యాక్టింగ్ పరంగా మాత్రం వీక్ అనిపించుకోలేదు. డాన్స్ .. ఫైట్స్ అన్నింటిలోను గట్టివాడే అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఆయన ఈ రీమేక్ చేస్తున్నాడు.
కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమా షూటింగు, ఇటీవలే మొదలైంది. బాలీవుడ్ ప్రేక్షకులు కండలు తిరిగిన హీరోలను .. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సల్మాన్ .. హృతిక్ రోషన్ .. జాన్ అబ్రహం .. టైగర్ ష్రాఫ్ .. ఇలా ఆ జాబితాలో చాలామంది హీరోలు కనిపిస్తారు.
అందువలన బెల్లంకొండ శ్రీనివాస్ జిమ్ లో గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇక హిందీ భాషపై పట్టు సాధించే పని కూడా చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ఆయన చెప్పినవే. ఇలా బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించడానికి శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దూకుడు మీదే ఉన్న ఈ కుర్రాడు అక్కడ ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.