చంద్రబాబు ఇప్పుడేం అంటాడో?: విజయసాయిరెడ్డి
- రాయలసీమకు కృష్ణా జలాలు ఎలా తరలిస్తారని తెలంగాణ వాదన
- దాన్ని సమర్థించేలా తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఫిర్యాదు చేయించారు
- వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలవాలని కోరుకున్నట్టే కదా
నదీ జలాల విషయంలో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణా వాదనను సమర్థించేలా టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు.
'రాయలసీమకు కృష్ణా జలాలు ఎలా తరలిస్తారన్న తెలంగాణ వాదనను సమర్థించేలా తన ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించిన చంద్రబాబు ఇప్పుడేం అంటాడో. కృష్ణా నదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలవాలని కోరుకున్నట్టే కదా? ఈ రైతు ద్రోహి' అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.