ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమిపై మోదీ స్పందన
- జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం
- మన హాకీ జట్టు వీలైనంత బాగా ఆడడానికి ప్రయత్నించింది
- మన క్రీడాకారులను చూసి దేశం గర్విస్తోంది
టోక్యో ఒలింపిక్స్‌లో ఈ రోజు ఉదయం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్ లో బెల్జియం టీమ్ చేతిలో భారత హాకీ టీమ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫస్టాఫ్ ముగిసేసరికి 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ ఆ తర్వాత బాగా రాణించకపోవడంతో ఓటమి పాలై నిరాశ మిగిల్చింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.
జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగమని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు వీలైనంత బాగా ఆడడానికి ప్రయత్నించిందని, వారు ప్రయత్నించిన తీరు బాగుందని అన్నారు. తదుపరి మ్యాచ్‌తో పాటు భవిష్యత్‌లోనూ ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని చెప్పారు. మన క్రీడాకారులను చూసి దేశం గర్విస్తోందని మోదీ అన్నారు.
కాగా, ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు ఇక కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో జర్మనీ-ఆస్ట్రేలియా జట్లు పోటీ పడనున్నాయి.