కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకుంటున్న కొవాగ్జిన్ టీకా
- కొవాగ్జిన్‌పై ఐసీఎంఆర్ అధ్యయనం
- డెల్టా, డెల్టా ప్లస్ రకాలను సమర్థంగా అడ్డుకుంటున్న టీకా
- ‘బయోరిగ్జివ్’ సైన్స్ వెబ్‌సైట్‌లో వ్యాసం
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్‌పైనా ప్రభావం చూపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. డెల్టా, డెల్టా ఏవై-1, బి.1.617.3 రకం వైరస్‌లపై కొవాగ్జిన్‌ను పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా ‘బయోరిగ్జివ్’ సైన్స్ వెబ్‌సెట్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో రెండో దశ ఉద్ధృతికి డెల్టా వేరియంటే కారణమని ఇప్పటికే తేలింది. ఆ తర్వాత అది మళ్లీ రూపాంతరం చెంది డెల్టా ప్లస్‌గా మారింది. ఈ వేరియంట్‌పై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది.