రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల జలజగడం: బీజేపీ నేత లక్ష్మణ్
- జలవివాదంపై లక్ష్మణ్ వ్యాఖ్యలు
- సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని వెల్లడి
- ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజన పార్టీలని విమర్శలు
- కేంద్ర నిధులను టీఆర్ఎస్ సర్కారు దారిమళ్లిస్తోందని ఆరోపణ
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తాజా పరిణామాలపై స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జలజగడం అని అన్నారు. జల వివాదం పరిష్కరించుకోవడంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటాయని, కులాలు, మతాల పేరిట ఓట్లు దండుకోవడమే వాటి లక్ష్యం అని విమర్శించారు.
అటు, కేంద్ర పథకాల అమలుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించడంలేదని, కేంద్రం ఇచ్చే నిధులను సర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. చాలావరకు నిధులు ఖర్చు చేయకపోవడంతో నిధులు తిరిగి వెళ్లాయని వివరించారు. తెలంగాణలోని గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి కేంద్రం నుంచి వచ్చే నిధులేనని లక్ష్మణ్ స్పష్టం చేశారు.