సోము వీర్రాజు నేతృత్వంలో ఢిల్లీ వెళుతున్న ఏపీ బీజేపీ బృందం
- ఢిల్లీలో మూడ్రోజుల పాటు పర్యటన
- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై వివరణ
- ఆర్బీఐకి ఫిర్యాదు చేసే అవకాశం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నేతల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుంది. ఈ బృందం ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించనున్నారు. అటు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, తదితర ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఏపీ ప్రభుత్వ అప్పుల వ్యవహారాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి నివేదించారు.