సింధు ఓదార్పు వచనాలతో కన్నీటి పర్యంతమైన తై జు యింగ్
- టోక్యో ఒలింపిక్స్ లో ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ పోటీలు
- చైనాకు చెందిన చెన్ యుఫెయ్ కు స్వర్ణం
- ఫైనల్లో ఓడిన తై జు యింగ్
- బాధపడుతున్న తై జుకు సింధు ఓదార్పు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ క్రీడాంశంలో పోటీలు ముగిశాయి. మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని చెన్ యుఫెయ్ (చైనా) కైవసం చేసుకుంది. ఫైనల్లో ఓటమిపాలైన చైనీస్ తైపే అమ్మాయి తై జు యింగ్ రజతంతో సరిపెట్టుకుంది. ఈ పోటీల్లో పీవీ సింధుకు కాంస్యం లభించడం తెలిసిందే. సెమీస్ లో సింధు... తై జు యింగ్ చేతిలోనే ఓడింది. అయితే, పతకాలు ప్రదానం చేసే సమయంలో.... ఫైనల్లో ఓడినందుకు ఎంతో బాధపడుతున్న తై జు యింగ్ ను సింధు ఓదార్చింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఊరడించింది.
"ఫైనల్లో ఓటమి నీ మనసుకెంత కష్టం కలిగించిందో నాకు తెలుసు. నువ్వు మంచి ఆటతీరునే కనబర్చావు. కానీ ఇవాళ నీకు కలిసిరాలేదు. గతంలో నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను" అని పేర్కొంది. సింధు మాటలతో తై జు యింగ్ కన్నీటి పర్యంతమైంది. సింధు ఓదార్చిన తీరుతో తాను తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యానని తై జు చెప్పింది. సింధూ... నువ్వందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అంటూ స్పందించింది.