డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లే గెలిచాను: టోక్యో నుంచి మీడియాతో పీవీ సింధు
- ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డా
- కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉంది
- నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారు
- కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నానన్న సింధు
టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె టోక్యో నుంచి తన కోచ్ పార్క్‌తో కలిసి ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడింది. ఈ ఒలింపిక్స్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపింది. ఇందులో కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉందని చెప్పింది. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపింది.
తాను డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లే ఈ పతకం గెలుచుకున్నానని చెప్పింది. తాను గతంలో గచ్చిబౌలి స్టేడియంలో చేసిన సాధన బాగా ఉపయోగపడిందని తెలిపింది. భారత్ కు పతకం తీసుకురావడం గర్వంగా ఉందని, అయితే, సెమీస్‌లో ఓడిపోవడంతో బాధపడ్డానని చెప్పింది. ఈ ఒలింపిక్స్‌లో సాధించిన విజయాన్ని తన కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నానని తెలిపింది.