నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అబ్బాయిని చితగ్గొట్టిన అమ్మాయి.. వీడియో ఇదిగో!
- యూపీలో ఘటన
- భారీగా ట్రాఫిక్ జామ్
- అడ్డం వచ్చిన మరో వ్యక్తినీ కొట్టిన అమ్మాయి
- #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ వైరల్
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ అబ్బాయిని ఓ అమ్మాయి చితగ్గొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను అరెస్టు చేయాలని కోరుతూ #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఆ రౌడీ అమ్మాయి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువకుడిని ఆ యువతి కొట్టింది. దీంతో ఆమెకు భయపడిపోయిన యువకుడు దెబ్బలు తింటూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఆ యువకుడి ఫోనును కూడా లాక్కొని పగలకొట్టింది ఆ అమ్మాయి.
అక్కడున్న వారంతా ఆ అమ్మాయి తీరుకి భయపడి.. ఎవరూ అడ్డుకోలేదు. యువకుడిని అమ్మాయి బారి నుంచి రక్షించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చివరకు దెబ్బలు తింటోన్న యువకుడిని రక్షించేందుకు ధైర్యం చేసి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. దీంతో అతడిని కూడా కాలర్ పట్టుకుని కొట్టింది ఆ రౌడీ అమ్మాయి.
రోడ్డు సిగ్నల్ వద్దే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ యువకుడు తన కారును ఢీకొట్టిన నేపథ్యంలో ఆమె కిందకు దిగి ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసిన చాలామంది #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.