జమ్మూకశ్మీర్‌లో మరోసారి కలకలం రేపిన 4 డ్రోన్లు
- సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద ఘటన
- ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగిన వైనం
- 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చిన పోలీసులు
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్లు కలకలం రేపాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపుతుండడంతో భారత సైనికులు ఇప్పటికే అనేక సార్లు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, గత అర్థరాత్రి జమ్మూకశ్మీర్ లోని సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద నాలుగు డ్రోన్లు సంచరించడం గమనార్హం.
వాటిలో ఒకటి ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగింది. డ్రోన్లు దూరంగా సంచరించడంతో కాల్పులు జరిపినా ప్రయోజనం ఉండదు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు వాటిపై కాల్పులు జరపలేదని అధికారులు చెప్పారు. డ్రోన్ల సంచారంపై జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి డ్రోన్లు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.