శిల్ప శెట్టికి మరో బాలీవుడ్ హీరోయిన్ మద్దతు
- పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన శిల్ప శెట్టి భర్త
- వార్తల్లో తన పేరు లాగుతున్నారంటూ మీడియా సంస్థలపై శిల్ప కేసు
- కేసు వేసినందుకు సంతోషంగా ఉందన్న రిచా చద్దా
బాలీవుడ్ లో అందమైన కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శిల్పాశెట్టి... ఎన్నో ఏళ్ల పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగారు. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని గృహిణిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. యోగా, ఫిట్ నెస్ తదితర అంశాలపై వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎంతో కృషి చేశారు.
గౌరవప్రదంగా తన జీవితం కొనసాగుతున్న తరుణంలో ఆమె మీద పిడుగు పడినట్టైంది. ఆమె భర్తపై పోర్నోగ్రఫీ కేసులు నమోదు కావడం, ఆయన అరెస్ట్ కావడం ఆమెను షాక్ కు గురి చేశాయి. చివరకు ఆమె కూడా పోలీసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. విచారణ అధికారుల ఎదుట ఆమె కంటతడి పెట్టుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తన భర్త అమాయకుడని విచారణ అధికారులతో శిల్ప చెప్పడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శిల్పకు పలువురు తమ మద్దతును తెలియజేస్తున్నారు. తాజాగా హీరోయిన్ రిచా చద్దా కూడా శిల్పకు మద్దతుగా నిలిచింది. పురుషులు చేసిన తప్పులకు మహిళలను నిందిస్తుండటం ద్వారా మనం ఒక జాతీయ క్రీడను రూపొందించామని విమర్శించింది. శిల్ప కేసు వేసినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. తన భర్తకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసే క్రమంలో తన పేరును లాగుతున్నారంటూ మీడియా సంస్థలపై శిల్ప కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.