టీకాలు తీసుకోని వారితో ముప్పు తప్పదు: హెచ్చరించిన ఫౌచీ

  • చూస్తుంటే అమెరికాలో మరిన్ని లాక్‌డౌన్‌లు తప్పేలా లేదు
  • టీకాలు తీసుకోనివారు అమెరికన్ల హక్కులను కాలరాస్తున్నారు
  • అమెరికాలో 60 శాతం మంది వ్యాక్సిన్‌కు దూరం
అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది ఇంకా టీకాలు తీసుకోలేదని, వీరివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చూస్తుంటే అమెరికాలో మరిన్ని లాక్‌డౌన్‌లు తప్పకపోవచ్చని అనిపిస్తోందని అన్నారు.

వ్యాక్సిన్ వేయించుకోని వారి ద్వారా వైరస్ ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. టీకాలు తీసుకోవడానికి ముందుకు రానివారు ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్న అమెరికన్ల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అమెరికన్లలో ఇప్పటి వరకు 60 శాతం మంది టీకాలు వేయించుకోకపోవడం గమనార్హం.


More Telugu News