తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇవిగో!
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
- ప్రగతిభవన్ లో క్యాబినెట్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన సీఎం
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిర్ణయాలు ఇవే...
నిర్ణయాలు ఇవే...
- వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, ఆల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం.
- అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఇకపై తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా నామకరణం.
- అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.
- మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు.
- రాష్ట్రంలో మున్ముందు అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులకు సీఎం ఆదేశం.
- అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశం.
- పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజా అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు