సీజ్ చేసిన వాహనాలు వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయి: భూమా అఖిలప్రియ

  • ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాలు
  • అక్రమ తవ్వకాలంటూ అఖిలప్రియ ధ్వజం
  • వైసీపీ నేతలకే అనుమతులిస్తున్నారని ఆరోపణ
  • అక్రమ తవ్వకాలను తాము అడ్డుకుంటామని హెచ్చరిక
ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని అన్నారు.

సీజ్ చేసిన వాహనాలు వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని వెల్లడించారు. వైసీపీ నేతలకే తవ్వకాల అనుమతులు ఇస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు. వారం రోజుల్లో అక్రమ తవ్వకాలు ఆగకపోతే తామే అడ్డుకుంటామని ఆమె హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఈ అక్రమాల్లో భాగం ఉందని ఆరోపించారు.


More Telugu News