టోక్యో ఒలింపిక్స్ 100మీ పరుగులో ఎలైన్ థాంప్సన్ కు స్వర్ణం... క్లీన్ స్వీప్ చేసిన జమైకా
- టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘట్టం
- 100 మీ పరుగులో మూడు పతకాలు జమైకాకే!
- రజతం సాధించిన షెల్లీ
- కాంస్యం దక్కించుకున్న షెరికా
- పోడియంపై జమైకా జెండా రెపరెపలు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 100 మీటర్ల పరుగులో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో ఎలైన్ థాంప్సన్ సరికొత్త ఒలింపిక్ రికార్డు నమోదు చేసింది. 100మీ పరుగును ఆమె 10.61 సెకన్లలో పూర్తి చేసింది. కాగా ఈ ఫైనల్ రేసులో విశేషం ఏమిటంటే... స్వర్ణం మాత్రమే కాదు, రజతం, కాంస్యం కూడా జమైకా అథ్లెట్లకే దక్కాయి. ట్రాక్ అంశాల్లో తమకు ఎదురులేదని చాటుతూ జమైకా మహిళా స్ప్రింటర్లు రేసు గుర్రాల్లా దూసుకుపోయారు.
ఎలైన్ థాంప్సన్ పసిడి సాధించగా, రెండుసార్లు చాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (10.74) రజతం, షెరికా జాక్సన్ (10.76) కాంస్యం కైవసం చేసుకున్నారు. మెడల్ ప్రదానం చేసే పోడియంపై ముగ్గురూ జమైకన్లే దర్శనమివ్వడం టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘట్టం అని చెప్పాలి.