ఉమాను దారి మళ్లించి దాడి జరిగే చోటుకు పోలీసులే పంపించడం హేయం: చంద్రబాబు
- గొల్లపూడిలో దేవినేని ఉమ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
- ఉమ కుటుంబానికి పరామర్శ
- పార్టీ అండగా ఉంటుందని భరోసా
- పోలీసులు దిగజారి పనిచేస్తున్నారన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ గొల్లపూడిలో దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించారు. ఉమ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తన పర్యటనపై ట్వీట్ చేశారు. దేవినేని ఉమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ నేతలు దాడి చేస్తే, దగ్గరుండి వారికి సహకరించిందే కాకుండా, పోలీసులు తిరిగి ఉమాపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
పోలీసులు ఇంతగా దిగజారి పనిచేయడం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఉమ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఏంచేశారని నిలదీశారు. కొండపల్లి నుంచి తిరిగొస్తున్న ఉమాను దారి మళ్లించి దాడి జరిగే చోటుకు పోలీసులే పంపించడం హేయమని అభివర్ణించారు. ఇలాంటి దాడులకు టీడీపీ భయపడబోదని, పోరాటాలు ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.