టోక్యో ఒలింపిక్స్: తొలి గేమ్ ను ప్రత్యర్థికి కోల్పోయిన పీవీ సింధు
- బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్స్
- మహిళల సింగిల్స్ లో సింధు వర్సెస్ యింగ్
- తొలి గేమ్ లో 18-21తో సింధు ఓటమి
- రెండో గేమ్ లో హోరాహోరీ
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ సమరంలో తెలుగుతేజం పీవీ సింధు... వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండగా, సింధు తొలి గేమ్ ను ప్రత్యర్థికి కోల్పోయింది. ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ గేమ్ ను తై జు యింగ్ 21-18 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, రెండో గేమ్ ను సింధు ఆశావహ దృక్పథంలో ప్రారంభించింది. ప్రస్తుతం 4-3 తేడాతో యింగ్ పై ఆధిక్యంలో ఉంది.