టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించిన జకోవిచ్.. 'కాంస్యం' మ్యాచ్ లో ఓటమి

  • జకోవిచ్ పై నెగ్గిన పాబ్లో కరెనో బుస్టా
  • బుస్టాకు కాంస్యం
  • మిక్స్ డ్ డబుల్స్ నుంచి వైదొలగిన జకో జోడీ
  • పతకం ఏమీ లేకుండా ఇంటిముఖం
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ కు టోక్యో ఒలింపిక్స్ ఓ చేదు అనుభవంలా మిగిలిపోయింది. స్వర్ణం సాధించి కెరీర్ లో అరుదైన గోల్డెన్ స్లామ్ నమోదు చేయాలని భావించిన ఈ సెర్బియా స్టార్ కు కనీసం కాంస్యం కూడా దక్కలేదు. ఇవాళ కాంస్యం కోసం జరిగిన పోరులో జకోవిచ్ 4-6, 7-6, 3-6తో స్పెయిన్ కు చెందిన పాబ్లో కరెనో బుస్టా చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో టోక్యో ఒలింపిక్స్ లో జకో ప్రస్థానం ముగిసింది.

అంతకుముందు, జకోవిచ్-నినా స్టాంకోవిచ్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ కాంస్యం పోరు నుంచి తప్పుకుంది. ఈ జోడీ ఎందుకు వైదొలగిందన్నది తెలియరాలేదు. దాంతో పతకం ఏమీ లేకుండానే జకోవిచ్ ఇంటిముఖం పట్టాడు.


More Telugu News