ఒడిశా కూలీల మృతిపై సీఎం జగన్ మానవీయ స్పందన
- రేపల్లె మండలం లంకెవాని దిబ్బ వద్ద ఘటన
- ఆరుగురు ఒడిశా కూలీల సజీవదహనం
- సీఎం జగన్ మానవతా దృక్పథం
- మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం
గుంటూరు జిల్లాలో ఆక్వా చెరువుల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా కూలీలు ఆరుగురు దుర్మరణం పాలవడం పట్ల సీఎం జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. వారు మన రాష్ట్రానికి చెందినవారు కాకపోయినా, ఉపాధి కోసం వచ్చారని తెలిపారు. అగ్నిప్రమాదంలో చనిపోయారని, మానవీయ కోణంలో స్పందించి వారి కుటుంబాలకు సాయం అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. అటు, ఆక్వా చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.