ఝార్ఖండ్ లో చెరువుల్లా రోడ్లు.. మునిగిపోయిన కార్లు: వీడియో వైరల్
- ఝార్ఖండ్ లో 24 గంటలుగా భారీ వర్షం
- మరో 24 గంటల పాటు అతిభారీ వర్షాలు
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు
వర్షాలు దండయాత్ర చేస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ కాలువలు, చెరువుల్లా మారి.. ఊర్లను ముంచేస్తున్నాయి. 24 గంటలుగా తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఝార్ఖండ్ అల్లాడిపోతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఝార్ఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే వర్షాలు తెరిపి లేకుండా కురుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, ఝార్ఖండ్ వ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాలను వరద ముంచెత్తింది. రాష్ట్ర రాజధాని రాంచీలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. భారీగా వరద రావడంతో పార్కింగ్ చేసిన కార్లు, బైకులు మునిగిపోయాయి. ఆ వీడియో వైరల్ అయింది.