ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి.. ట్రాఫిక్ జామ్!
- పదిహేను అడుగుల గొయ్యి
- గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు
- వాహనాల దారి మళ్లింపు
అది ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ప్రాంతం. ఆ రోడ్డంతా బిజీబిజీగా ఉంటుంది. అలాంటి చోట ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జంఝాటాలను తెచ్చింది. ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది.
భారీ గొయ్యి పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఐఐటీ నుంచి అధ్చినికి వెళ్లే వాహనాలను కత్వారియా సరాయి గుండా దారి మళ్లించామని, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి ఆ మార్గంలో వెళ్లొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
కాగా, దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతుతో ఆ గొయ్యి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రజాపనుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.