టోక్యో ఒలింపిక్స్ లో దక్షిణాఫ్రికాపై నెగ్గిన భారత మహిళల హాకీ జట్టు... క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం
- గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన భారత్
- 4-3తో దక్షిణాఫ్రికాపై విజయం
- రేసులో నిలిచిన భారత అమ్మాయిలు
- చావోరేవో మ్యాచ్ లో సత్తా చాటిన వైనం
టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ అమ్మాయిలు సత్తా చాటారు. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. ఇవాళ జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు 4-3తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.
ఇక భారత అమ్మాయిలు నాకౌట్ దశకు చేరడం ఐర్లాండ్, బ్రిటన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఓడిపోయినా, మ్యాచ్ డ్రాగా ముగిసినా చాలు... భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటుంది.
ఇక భారత అమ్మాయిలు నాకౌట్ దశకు చేరడం ఐర్లాండ్, బ్రిటన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఓడిపోయినా, మ్యాచ్ డ్రాగా ముగిసినా చాలు... భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటుంది.