కోమాలో తమిళ నటుడు వేణు అరవింద్!
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వేణు అరవింద్
- బ్రెయిన్ లో చిన్న గడ్డ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు
- ఆపరేషన్ తర్వాత కోమాలోకి వెళ్లినట్టు సమాచారం
తమిళ బుల్లితెరపై మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న వేణు అరవింద్ కోమాలోకి వెళ్లారు. హఠాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కరోనా బారిన పడిన వేణు పూర్తిగా కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. వైద్యపరీక్షల్లో ఆయనకు న్యుమోనియో సోకినట్టు తేలింది. దీంతో, న్యుమోనియాకు ఆయన చికిత్స తీసుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలో మెదడులో ఆయనకు చిన్నపాటి గడ్డ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఈ చికిత్స తర్వాత ఆయన కోమాలోకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని స్నేహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు, ఈ వార్తలపై సినీనటి రాధిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, వేణు కోమాలోకి వెళ్లారంటూ మీడియాలో అసత్య కథనాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆమె తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఇంటికి రావాలని అందరూ ప్రార్థించాలని కోరారు.
తొలుత టీవీ సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న వేణు... ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వెండితెరకు పరిచయం అయ్యారు. పలు సినిమాల్లో నటించిన ఆయన... ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ బుల్లి తెరకు వచ్చి, అనేక సీరియళ్లలో నటించారు.