తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. శ్రీరంగాపూర్‌లో అత్యధికంగా 2.5 సెం.మీ. వర్షం
- పశ్చిమ భారతం నుంచి తెలంగాణవైపు గాలులు
- రాష్ట్రంలో సాధారణంగా కదులుతున్న రుతుపవనాలు
- పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్‌లో 2.5, పెబ్బేరులో 1.8, గద్వాలలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది.