నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సభ్యుల నియామకంపై గెజిట్ నోటిఫికేషన్

  • ఇటీవల నల్సా సభ్యుల నియామకం
  • నల్సాలో 8 మంది సభ్యులు
  • ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కు చోటు
  • ఎక్స్ అఫిషియోగా ఏపీ హైకోర్టు జడ్జి
జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సభ్యుల నియామకంపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సంప్రదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవల నల్సాలో  8 మంది సభ్యులను నియమించింది.

జస్టిస్ ఎస్.మురళీధరన్ (ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అరవింద్ కుమార్ (కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి), సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కేవీ విశ్వనాథన్, మీనాక్షి అరోరా, సిద్ధార్థ లూథ్రా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మనన్ కుమార్ మిశ్రా, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బీనా చింతలపూడి, సామాజిక కార్యకర్త ప్రీతి ప్రవీణ్ పాట్కర్ లను కేంద్రం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులుగా నియమించింది.

అంతేకాదు, సెంట్రల్ అథారిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్య బాగ్చిని నియమించింది.


More Telugu News