ఎంపీ మాలోత్ కవితకు ఊరట... ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే
- ఓటర్లకు డబ్బులు పంచారంటూ కవితపై ఫిర్యాదు
- 2019లో బూర్గంపహాడ్ పీఎస్ లో కేసు నమోదు
- ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన ప్రజాప్రతినిధుల కోర్టు
- హైకోర్టును ఆశ్రయించిన మాలోత్ కవిత
గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఎంపీ మాలోత్ కవిత హైకోర్టులో సవాల్ చేశారు. కవిత పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేసింది.
కోర్టు తీర్పు అమలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో ఎంపీ కవితకు ఊరట కలిగినట్టయింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం వేళ ఓటర్లకు డబ్బులు పంచారంటూ మాలోత్ కవితపై బూర్గంపహాడ్ పీఎస్ లో కేసు నమోదవడం తెలిసిందే.