ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు.. ఉల్లంఘిస్తే చర్యలు
- కరోనా విజృంభణ అధికంగా ఉండడంతో మరోసారి పొడిగింపు
- నేటి నుంచి ఆగస్టు 14 వరకు అమలు
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
కరోనా విజృంభణ అధికంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కరోనా ఉద్ధృతి ఇప్పటికీ తగ్గకపోవడంతో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
నేటి నుంచి ఆగస్టు 14 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా, ఏపీలో పలు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తగ్గినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో తగ్గట్లేదు. మరోవైపు, వచ్చే నెలలోనే పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు త్వరితగతిన కరోనా వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఏపీలో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి.