తెలంగాణలో ఈరోజు నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

  • కరోనా వల్ల మూతపడిన థియేటర్లు
  • వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి కూడా అనుమతి
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. థియేటర్లలో సినిమా ఆడి చాలా రోజులయింది. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్రమంగా కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు అన్నింటినీ తెరుస్తోంది.

ఈ క్రమంలో సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి కూడా అనుమతించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు టీఎస్ ప్రభుత్వం అనుమతించింది. పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో థియేటర్లను పునఃప్రారంభించడానికి యాజమాన్యాలు ముందుకొచ్చాయి.  

ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. చివరగా 'వకీల్ సాబ్' థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూత పడ్డాయి. ఈరోజు సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు', తేజ సజ్జ నటించిన 'ఇష్క్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.


More Telugu News