గుంటూరులో దారుణం.. రొయ్యల చెరువు కాపలాదారులు ఆరుగురు సజీవ దహనం
- విద్యుదాఘాతమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
- కానే కాదంటున్న విద్యుత్ అధికారులు
- ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెబుతుండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.